News October 9, 2025
ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో ఆయన ఉండవల్లిలో బుధవారం సమావేశమయ్యారు. టీచర్ల బదిలీలు, భాషా పండితుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని లోకేశ్ అన్నారు.
Similar News
News October 9, 2025
గుంటూరు జిల్లా రోడ్లకు ఊపిరి..!

రాబోయే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గుంటూరు జిల్లా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అమరావతి మార్గం సహా తెనాలి–మంగళగిరి, గుంటూరు–హనుమాన్‌పాలెం రహదారుల మెరుగుదలకు రూ.11 కోట్ల పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. అదనంగా తొమ్మిది ప్రధాన ఎండీఆర్ రోడ్ల అభివృద్ధికి రూ.31 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. రహదారులు సక్రమంగా తయారైతే పుష్కరాల సమయంలో రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.
News October 9, 2025
ANU కొత్త వైస్ ఛాన్సలర్ నేపథ్యం ఇదే..!

ANU కొత్త వైస్ ఛాన్సలర్‌గా సత్యనారాయణ రాజు నియామకమైన విషయం తెలిసిందే. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను అందుకున్నారు. 2017లో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అవార్డును, మహిమ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును, ఉత్తమ AN అవార్డును, 2018లో డాక్టర్ ఆనంద్ ప్రకాష్ అవార్డును, ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు.
News October 9, 2025
గుంటూరు: అక్రమాల అడ్డుకట్టకు టాస్క్ ఫోర్స్

గుంటూరు జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు SP వకుల్ జిందాల్ ప్రత్యేక టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. గంజాయి, పేకాటలపై ప్రత్యేక నిఘా కోసం గతంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి వర్గాల్లో అత్యధిక కాలం పని చేసి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో అనుభవం ఉన్న సిబ్బందితో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో సబ్ డివిజన్‌కు ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బందిని నియమించారు