News February 23, 2025

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి

image

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్,మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 28, 2026

మద్దూరు: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన ఆలేటి మహేష్(28) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్, తీవ్ర మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ అసిఫ్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

News February 28, 2026

వాంఖడేలో ‘రవిశాస్త్రి’ స్టాండ్

image

వాంఖడే స్టేడియంలో లెవెల్-1 స్టాండ్‌కు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. క్రికెటర్, కోచ్, కామెంటేటర్‌గా ఆయన సేవలకు గుర్తింపుగా ప్రెస్ బాక్స్ కింది స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. అలాగే దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీ పేర్లను స్టేడియం గేట్లకు పెట్టనున్నారు. ముంబై దిగ్గజాలను గౌరవించే క్రమంలో అపెక్స్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది.

News February 28, 2026

తిరుపతి: మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తిపై కత్తిపోట్లు

image

మద్యంమత్తులో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యువకుల మధ్య తలెత్తిన వివాదంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్‌కు చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రుడిని రుయా ఆసుపత్రికి తరలించారు.