News September 6, 2025

ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పదోన్నతుల వల్ల ఖాళీ అయిన ఉపాధ్యాయ పోస్టులను అదే మండలం లేదా పక్క మండలంలో అందుబాటులో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Similar News

News September 7, 2025

సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం: VZM కలెక్టర్

image

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం మరోసారి ప్రకటించారు. రాజాంలోని నందిని ట్రేడర్స్‌కు ఈనెల 4న 24 టన్నుల యూరియా సరఫరా చేశామని, తగినంత స్టాకు ఉందన్నారు. షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణే గొడవకు కారణమన్నారు. దీనికి ఎరువుల సరఫరాతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అవసరమైనంత ఎరువులను సరఫరా చేస్తున్నామన్నారు.

News September 7, 2025

ఏ దేవుణ్ని ఏ సమయంలో పూజిస్తే మంచిది?

image

మన ఇష్ట దైవాన్ని ఏ సమయంలోనైనా పూజించవచ్చు. అయితే కొన్ని సమయాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయని పండితులు అంటున్నారు. వాటి ప్రకారం.. సూర్యుణ్ని ఉదయం 6 గంటల లోపు పూజించాలి. అప్పుడే రాముడు, వేంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. శివుణ్ని ఉదయం, సాయంత్రం 6 గంటల తర్వాత పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మధ్యాహ్నం వేళ హనుమంతుణ్ని పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. లక్ష్మీదేవి పూజకు రాత్రి 6-9 అనువైన సమయం.

News September 7, 2025

నేడే చంద్ర గ్రహణం.. టైమింగ్స్ ఇవే

image

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి.8.58 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. రేపు తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను ఇవాళ కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.