News March 5, 2025

ఉప్పలగుప్తం : వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

ఉప్పలగుప్తానికి చెందిన విద్యార్థిని మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. ఆమె భీమవరంలో బీఫార్మసీ చదువుతోంది. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తండ్రి మందలించాడని ఆత్మహత్యకు ప్రయత్నించింది. టౌన్ సీఐ వీరబాబు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. విద్యార్థిని కాపాడడంతో.. పెను ప్రమాదం తప్పింది.

Similar News

News July 7, 2025

GNT: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.

News July 7, 2025

ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.

News July 7, 2025

పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

image

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్‌మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.