News January 27, 2025
ఉప్పలగుప్తం: స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు పురస్కారం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ హోదాలలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో పాములను సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ సమాజ సేవ చేస్తున్న ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ కలెక్టర్ మహేశ్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మను పలువురు అభినందించారు.
Similar News
News November 7, 2025
కల్వకుర్తిలో కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

ఈ నెల 9న కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. 2006 తర్వాత జన్మించిన, 75 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.
News November 7, 2025
నరసరావుపేట: వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. సహజ సౌందర్యం నడుమ అధికారులు ఆనందంగా గడిపారు.
News November 7, 2025
ఆసిఫాబాద్: ‘పెండింగ్ సమస్యలను పరిష్కరించండి’

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆసిఫాబాద్‌లో ఈరోజు ఏటీడీవో శివకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


