News December 11, 2025
ఉప్పల్‌పల్లి సర్పంచ్‌గా ర్యాకం శ్రీనివాస్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి ర్యాకం సంపత్‌పై 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీనివాస్ గెలుపుతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు.
Similar News
News March 30, 2026
నేడు RR vs CSK

ఐపీఎల్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది. అస్సాంలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్‌కు గత ఏడాది మొదటి మూడు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్ ఈసారి ఆ జట్టుకు పూర్తిగా సారథ్యం వహిస్తారు. మరోవైపు CSKకు రుతురాజ్ సారథ్యం కొనసాగిస్తారు. ఇప్పటివరకు ఈ జట్లు 31సార్లు తలపడగా CSK 16, RR 15సార్లు గెలిచింది. ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.
News March 30, 2026
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో ఈరోజు నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.
News March 30, 2026
కృష్ణా జిల్లాలో 133 మందిపై బైండోవర్ కేసులు

కృష్ణా జిల్లాలో 133 మంది పందెం రాయుళ్లపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల కారణంగా బెట్టింగ్లను అరికట్టేందుకు గాను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో పలు రకాల బెట్టింగ్లకు పాల్పడిన 133 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.


