News December 13, 2025

ఉప్పల్‌‌లో ఫుట్‌బాల్ మ్యాచ్.. CM, మెస్సీ ఆడేది అప్పుడే!

image

​సింగరేణి RR-9 వర్సెస్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఉప్పల్‌లో మ్యాచ్ షురూ అయ్యింది. 7v7 ఎగ్జిబిషన్/సెలిబ్రిటీ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ చివర్‌లో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్‌లోకి దిగి మెస్సీతో కలిసి ఆడనున్నారు. అంతకుముందు మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి చిన్నపిల్లలకు ఫుట్‌బాల్ క్లినిక్ నిర్వహించి, వాళ్లకు టెక్నిక్స్ నేర్పిస్తారు. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఇది పండగే.

Similar News

News March 3, 2026

HCUలో PhDకి దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU) PhD కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 13 కోర్సుల్లో కోర్సులు చేసేందుకు అవకాశముంది. ఆసక్తి, అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. కోర్సులు, అర్హత వివరాలు, ఫీజు తదితర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో <>http://acad.uohyd.ac.in/<<>> చూడండి.

News March 3, 2026

JNTUHలో 45 మంది అధ్యాపకులకు పదోన్నతులు

image

JNTUHలో కెరీర్ CAS కింద 45 మంది బోధనా అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. VC డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు సమక్షంలో ఆర్డర్ కాపీలు అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్‌గా 9 మంది, ప్రొఫెసర్‌లుగా 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్‌గా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ హయ్యర్ గ్రేడ్ పే పొందారు.

News March 3, 2026

కీసరగుట్ట ఆలయ గోపురంపై అద్భుత దృశ్యం

image

నగర శివారులోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీభవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో సోమవారం రాత్రి అద్భుత దృశ్యం కనివిందు చేసింది. స్వామివారి గుడి శిఖరంపై పౌర్ణమి చంద్రుడిని చూసిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని బంధనం చేశారు.