News June 27, 2024
ఉప్పల్‌లో యాక్సిడెంట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

ఉప్పల్‌లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్ పరిధి శ్రీనివాసపురం వాసి దినేశ్ కుమార్(36) మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. విధులు ముగించుకొని గురువారం యాక్టివాపై ఇంటికి బయల్దేరాడు. Genpact వద్ద లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News February 4, 2026
మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
News February 4, 2026
RR: మున్సిపల్ బరిలో 437 మంది అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.126 వార్డుల్లో మొత్తం 615 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 178 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 437 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ 126, బీఆర్ఎస్ 122, బీజేపీ 109, బీఎస్పీ 3, CPI(M) 2, MIM 1, AIFB2, సీపీఐ 2, జనసేన 9, ఇండిపెండెంట్ 57, ఇతరులు నలుగురు బరిలో ఉన్నారు.
News February 3, 2026
200 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: రంగారెడ్డి కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 200 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 84,301 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 70,171 మంది పరీక్షలకు హాజరవుతారన్నారన్నారు. విద్యార్థులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


