News March 27, 2025
ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
Similar News
News September 15, 2025
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 15, 2025
HYD: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలపై ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News September 15, 2025
HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.