News September 16, 2025
ఉప్పల్ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొట్టిన లారీ

ఉప్పల్ NGRI సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీని ఢీకొని సెప్టిక్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ కుమార్ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ట్యాంకర్‌ను తొలగించి రోడ్డు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Similar News
News September 16, 2025
TTD టోకెన్ల జారీలో మార్పు

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.
News September 16, 2025
తిరుపతి: భయపెడుతున్న ‘కిడ్నీ’ భూతం

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామాన్ని కిడ్నీ భూతం భయపెడుతోంది. దాదాపు 100 మంది వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన సగిలాల వెంకటేశ్వర్లు(32) తిరుపతిలో డయాలసిస్ చేయించుకుంటూ సోమవారం మృతిచెందారు. ఈ గ్రామంలోని కిడ్నీ బాధితులంతా నిరుపేదలే. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయం భయంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News September 16, 2025
ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూడాలి: కలెక్టర్

ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మరిపెడ PACS పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సొసైటీ వద్దకు వచ్చిన రైతులకు నీడ, మంచి నీటి వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా అమ్మకాల రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.