News June 3, 2024
ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.
Similar News
News September 15, 2025
HYD: గొర్రెల స్కామ్ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.
News September 15, 2025
హైదరాబాద్‌కు ‘మోక్షం’ ప్రసాదించారు

1908..HYD మరిచిపోలేని ఏడాది. మూసీలో భారీ వరదలు వేలమందిని బలిగొన్నాయి. మరోసారి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909లో ద్విముఖ వ్యూహం రచించారు. అదే మూసీ ప్రాజెక్ట్. వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడే నేటికి చెక్కుచెదరని పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ HYDకు అందించారు. నేడు ఆ మహాజ్ఞాని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.
News September 15, 2025
HYDలో భారీ వరద.. రంగంలోకి మేయర్

అతి భారీ వర్షానికి నగరంలోని బస్తీలు, కాలనీలతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున వరదనీరు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో నగర మేయర్ విజయలక్ష్మి రాత్రి అక్కడ పర్యటించారు. మోటార్ల సహాయంతో నీటిని తోడేయాలని, రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.