News January 22, 2026

ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు పెట్టరా?

image

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి ఏడాదిన్నర కావొస్తోంది. చివరగా 2024 అక్టోబర్‌లో ఇక్కడ భారత్-బంగ్లాదేశ్ టీ20 జరిగింది. చివరి వన్డే 2023 WCలో, చివరి టెస్టు 2024 జనవరిలో జరిగాయి. అదే సమయంలో వైజాగ్ స్టేడియం మహిళల ప్రపంచకప్‌తో పాటు చాలా మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 కూడా అక్కడే జరగనుంది. దీంతో హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

Similar News

News February 21, 2026

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

image

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

News February 21, 2026

10% గ్లోబల్ టారిఫ్‌తో లాభమా? నష్టమా?

image

ట్రంప్ విధించిన 10% గ్లోబల్ <<19198500>>టారిఫ్‌పై<<>> ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. కానీ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఎదురుదాడికి దిగితే వ్యాపారాలు దెబ్బతినవచ్చంటున్నారు. ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

News February 21, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>AIIMS<<>> బీబీనగర్‌లో 13జూనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. MBBS అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1180, SC,ST,PwBD, మహిళలకు ఫీజు లేదు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in