News January 25, 2025

ఉప్పల్: GREAT.. గోల్డ్ మెడల్ సాధించాడు..!

image

ఉప్పల్ పరిధి నాగోల్ HMDA లే అవుట్‌లో నిర్వహించిన అండర్-17 ఇంటర్ డిస్ట్రిక్, స్టేట్ లెవెల్ 5000MTR స్కేటింగ్ కాంపిటీషన్‌లో మహమ్మద్ మీ రాజు హుస్సేన్ గోల్డ్ మెడల్ సాధించారు. మరోవైపు బౌరంపేటలో నిర్వహించిన అండర్-17 500MTR కాంపిటీషన్‌లో సిల్వర్ మెడల్ సాధించి వారెవ్వా అనిపించారు. దీంతో తల్లిదండ్రులు, కోచ్, బంధువులు, సహా..పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Similar News

News February 4, 2026

స్వామి వివేకానంద HYD పర్యటనకు 133 ఏళ్లు

image

స్వామి వివేకానంద భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏళ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠం శాఖ ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమాలన్నీ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహారాజ్ తెలిపారు. ఆయన ఇక్కడకి వచ్చినప్పుడు ఈ కాలేజీలోనే ప్రసంగించారు.

News February 4, 2026

కడప: ఒక నెలలో రూ.101.81 కోట్ల మద్యం తాగారు.!

image

కడప జిల్లాలో గత నెలలో రూ.101.81 కోట్ల మద్యం తాగేశారు. 1,37,715 కేసుల లిక్కర్ (IML), 75,953 కేసుల బీరు తాగారు. వీటి విక్రయాలు (రూ. కోట్లల్లో) బద్వేల్-రూ.11.27, జమ్మలమడుగు-రూ.7.52, కడప-రూ.28.45, ముద్దనూరు-రూ.3.74, మైదుకూరు-రూ.9.92, ప్రొద్దుటూరు-రూ.16.92, పులివెందుల-రూ.12.81, సిద్ధవటం-రూ.3.21, ఎర్రగుంట్ల-రూ.7.93 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.

News February 4, 2026

అనకాపల్లి: టీడీపీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

image

టీడీపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పునరుద్ఘాటించారు. బుధవారం అనకాపల్లిలో జరిగిన టీడీపీ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు, మరో 40 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.