News February 9, 2025
ఉప్పల్ MLA ఇంట్లో విషాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739118030073_705-normal-WIFI.webp)
ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్‌పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News February 10, 2025
HYD: సచివాలయంలో నేడు సీఎం సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739153921815_52296546-normal-WIFI.webp)
సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలోని తన పరిధిలోని శాఖలపై సీఎం సమీక్షించి, ఆయా శాఖల పనితీరు, పని స్వభావం గురించి అధికారులతో చర్చించనున్నారు. తన పరిధిలో ఉన్న ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం.
News February 10, 2025
HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739154410632_1212-normal-WIFI.webp)
HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే మీ భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.
News February 10, 2025
నేడు కొడంగల్‌కు KTR.. షెడ్యూల్ ఇదే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739114842664_705-normal-WIFI.webp)
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు కొడంగల్‌లో పర్యటిస్తారు.
షెడ్యూల్ వివరాలు:
10:30AM-నార్సింగిలోని నివాసం నుంచి బయలుదేరుతారు
12:30PM-పరిగి మాజీ MLA కొప్పుల మహేశ్ ఇంట్లో లంచ్
01:40PM-కొడంగల్ తున్కిమెట్లలో BRS పార్టీ జెండా ఆవిష్కరణ
02:00PM-హకీంపేట్, లగచర్ల, కోడైపల్లి, రోటిబండ తండా రైతులకు పరామర్శ
03:00PM-కోస్గి చౌరస్తాలో రైతు మహా ధర్నాలో పాల్గొంటారు.