News November 30, 2024
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం కోసం వేట

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో మత్స్యకారులు కనకం కోసం వేటను ప్రారంభించారు. తుఫాన్, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రగర్భంలో నుంచి బంగారు రజ కొట్టుకొస్తుందని మత్స్యకారుల నమ్మకం. ఒక్కొక్కరూ దువ్వెన పట్టుకుని, కెరటాలు ఒడ్డుకొచ్చి తిరిగి లోపలకు వెళ్లే సమయంలో ఇసుకపై దువ్వెనతో అడ్డుపెడతారు. ఆ సమయంలో ఇసుక లోపల నుంచి చిన్న బంగారు రజను వారికి దొరుకుతుందేమోనని ఆసక్తి చూపుతారు.
Similar News
News October 13, 2025
ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వాయిదా

ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తూ.గో. జిల్లా శాఖ నూతన మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు విషయమై ఈ నెల 15న ఉదయం 11 గంటలకు జరగవలసిన సమావేశం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం తెలిపారు. ఉమ్మడి తూ.గో. జిల్లా కాకినాడ నుంచి జాబితా ఇంకా అందకపోవడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. తదుపరి సమావేశపు తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
News October 13, 2025
గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్లో DEAD BODY

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్డుపై మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు గోకవరం PSకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవికి బొడ్డు,యర్రా పేర్లు పరిశీలన..?

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తారనే గుసగుస వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోదరుడి బావమరిది యర్రా వేణు గోపాల్ రాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.