News December 25, 2024
ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూల బోకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News December 26, 2024
MBNR: నేడు జిల్లాకు కేంద్రమంత్రి రాక
నర్వ మండలం రాయి కోడ్ గ్రామానికి, గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. నర్వ మండల, గ్రామాల బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News December 26, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
✔ఘనంగా క్రిస్మస్ వేడుకలు✔ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి✔NGKL: పోలీస్ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు✔వనపర్తి: అయ్యప్ప ఆలయంలో స్వచ్ఛభారత్✔ఒకవైపు ముసురు..మరోవైపు చలి✔CM ఇలాకాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు✔NRPT: మూడు రోజులు త్రాగునీటి సరఫరా నిలిపివేత✔సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దు:SPలు✔PUలో క్రీడాకారులకు ట్రాక్ సూట్, యూనిఫామ్స్ అందజేత
News December 25, 2024
MBNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మరి MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.