News September 26, 2024

ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్

image

మహబూబ్ నగర్‌లోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రిసెప్షన్ వర్టికల్ విధానంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు లభించిందని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. ఉమెన్ పీసీ జయమ్మను ఎస్పీ ఘనంగా సత్కరించారు. జయమ్మని ఆదర్శంగా తీసుకొని వర్టికల్ విభాగంలో అన్ని పోలీస్ స్టేషన్లు ప్రథమ స్థానంలో నిలవాలని కాంక్షించారు.

Similar News

News November 13, 2025

పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

image

మహబూబ్ నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.

News November 13, 2025

మహబూబ్‌నగర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మిడ్జిల్ (దోనూరు)లో 12.7 డిగ్రీలు, గండీడ్ (సల్కర్‌పేట)లో 13.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర చలి ప్రభావంతో పాల దిగుబడి తగ్గిందని రైతులు తెలిపారు.

News November 12, 2025

MBNR: భరోసా ఏడాది పూర్తి.. మొత్తం 163 కేసులు

image

మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.