News August 13, 2024
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు కోదాడ బాలిక

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన డబ్ల్యుపీఎల్ సెలక్షన్స్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి చిట్టి భవాని ఎంపికైనట్లు కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భవాని పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భవానీని అభినందించారు.
Similar News
News November 10, 2025
NLG: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ర్యాగింగ్ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడి తోటి విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దని, అలా చేస్తే, ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ కింద 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
News November 10, 2025
NLG: ప్రజావాణికి 94 ఫిర్యాదులు

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి. అందులో జిల్లా అధికారులకు సంబంధించి 31 ఫిర్యాదులు, రెవిన్యూ శాఖకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అన్నారు.
News November 10, 2025
నల్గొండ: రూ.549కే రూ.10 లక్షల బీమా

నల్గొండ డివిజన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 18 నుంచి 65 సం.ల వారికి అత్యంత తక్కువ ప్రీమియంతో గ్రూప్ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదంలో మరణం లేదా శాశ్వత వైకల్యం సభవింస్తే కేవలం రూ.549 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు కవరేజ్ పొందే విధంగా ప్లాన్ తెచ్చింది. ఈ అవకాశం IPPB ఖాతాదారులకు మాత్రమేనని, వివరాల కోసం పోస్టాఫీసును సంప్రదించాలని అధికారులు కోరారు.


