News October 13, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: 3 వికెట్లు తీసిన శ్రీ చరణి

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్-2025లో కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి రాణిస్తోంది. నిన్న వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసింది. 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోన విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌లో మెత్తం 6 వికెట్లు తీసింది.
Similar News
News October 13, 2025
భద్రాద్రి: నమోదైన వర్షపాతం వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఇలా ఉన్నాయి.. మణుగూరు 108.8, చర్ల 106.8, కరకగూడెం 94, బూర్గంపాడు 83.8, గుండాల 67, అశ్వాపురం 65.5, పినపాక 48.5, టేకులపల్లి 45.3, ఆళ్లపల్లి 43.3, దమ్మపేట 42.3, దుమ్ముగూడెం 41.3, భద్రాచలం 38, లక్ష్మీదేవి పల్లి 29.8, ఇల్లందు 24.5, కొత్తగూడెం 21, పాల్వంచ 15, చండ్రుగొండ 9.5, అన్నపురెడ్డిపల్లి 7.8, సుజాతనగర్ 7.3, జూలూరుపాడు 0.8MM వర్షపాతం నమోదైంది.
News October 13, 2025
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి.. ఆదాయం జోరు

పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి, డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్క్‌లోని దుప్పులను వీక్షించారు. 496 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్ లైఫ్ శాఖకు ₹27,390 ఆదాయం లభించింది. 480 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్‌కు కూడా భారీగా ఆదాయం వచ్చింది.
News October 13, 2025
వ్యాయామంతో క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్ట్స్‌కి చెక్

బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో భాగమైన రేడియోథెరపీతో పేషెంట్లు విపరీతమైన అలసటకు గురవుతారు. అయితే రెసిస్టెన్స్, ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే దీన్నుంచి త్వరగా కోలుకోవచ్చని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. వ్యాయామం కారణంగా చెడు ప్రభావాలు కనిపించలేదని స్టడీ వెల్లడించింది. కాబట్టి చికిత్స తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#Womenhealth<<>>