News April 15, 2025
ఉమ్మడిజిల్లాలో నేటి టాప్ న్యూస్

నిర్మల్: జిల్లాలో 3 యాక్సిడెంట్లు.. ఇద్దరి మృతి, ముగ్గురు సీరియస్
మంచిర్యాల: ఉరేసుకొని యువకుడి సూసైడ్
మంచిర్యాలలో: బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తీసిన వైద్యులు
సిర్పూర్(టి): ఐదేళ్ల బాలికపై కుక్కల దాడి
ADB: 500 దేశీదారు బాటిళ్లు సీజ్.. ఒకరి అరెస్ట్
పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి
Similar News
News November 10, 2025
క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.
News November 10, 2025
హనుమకొండ: 624 మందికి ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి

హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన 794 మందికి గాను, 624 మంది అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ నెల 22 వరకు 33 జిల్లాల నుంచి అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేయనున్నారు.
News November 10, 2025
హనుమకొండ: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు తెలంగాణ జిల్లాల అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్టుల్లో పాల్గొంటారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


