News July 13, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు.!

◆ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం
◆ మంచిర్యాలో రైలు కిందపడి యువకుడి మృతి
◆ బేలలో 20 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
◆ నిర్మల్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ◆ తాంసిలో పిడుగుపాటుకు 12 మేకలు మృతి
◆ మంచిర్యాల: చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ ◆ నిర్మల్: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
◆ ఆదిలాబాద్‌లో నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
◆ ఆసిఫాబాద్‌లో ఐదుగురు జూదరుల అరెస్ట్.
Similar News
News September 14, 2025
ADB: లోక్ అదాలత్‌లో న్యాయం: జిల్లా జడ్జి

లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, రాజీమార్గమే రాజమార్గం అని తెలిపారు. బోథ్ జూనియర్ కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప్, రాజీ ద్వారా 34 క్రిమినల్ కేసులు, ఒక సివిల్ వివాదం, నేరం ఒప్పుకోవడం ద్వారా 22 ఎక్సైజ్ కేసులు, 429 ఎస్టీసి కేసులను పరిష్కరించారు.
News September 13, 2025
ఆదిలాబాద్‌కు కాస్త ఊరట.. మళ్లీ భారీ వర్షాలు

ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో జల్లులు మాత్రమే కురిశాయి. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News September 13, 2025
ADB: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ ఉర్దూ మీడియంలో 17, ఇంగ్లీష్ మీడియంలో 49, తెలుగు మీడియంలో 56, ఫిజికల్ సైన్సెస్‌లో 20 సీట్లు ఉన్నట్లు తెలిపారు.