News July 19, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు

◆ త్వరలో ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి పర్యటన
◆ జైనూర్: భారీగా గుట్కా పట్టివేత
◆ భైంసా: కోతికి అంత్యక్రియలు
◆ మంచిర్యాల: చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
◆ తలమడుగు: పురుగుల మందుతాగి యువకుడు మృతి
◆ పెంచికల్ పెట్ : రోడ్డుపై చేపలు పడుతూ నిరసన
◆ దిలావార్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
◆ ఆదిలాబాద్: ప్రాజెక్టులకు జలకళ
◆ పలు చోట్ల ఉప్పొంగిన వాగులు, వంకలు
◆ రెబ్బెన: డ్రంక్ అండ్ డ్రైవ్
Similar News
News August 17, 2025
రేపు గణేష్ మండప నిర్వాహకులతో ఎస్పీ సమావేశం

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండప కమిటీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో ఈనెల 18న ఆదిలాబాద్ తనీషా గార్డెన్‌లో ఉదయం 10:30 గంటలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహిస్తున్న డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిర్వహకులకు మండపాల ఏర్పాటుపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కమిటీ సభ్యులు చేయవలసిన విధి విధానాలపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వన్ టౌన్, టూటౌన్, మావల, రూరల్ మండపాల సభ్యులు కావాలన్నారు.
News August 17, 2025
ఆదిలాబాద్: దివ్యాంగులకు ముఖ్య సూచన

ADB డివిజన్ TTD కల్యాణ మండపంలో ఈనెల 19న, ఉట్నూర్ డివిజన్ వికాసం పాఠశాలలో 20న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉపకరణాలు అందజేయుడానికి గుర్తింపు, నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు DEO కుష్బూగుప్తా తెలిపారు. అవసరమైన దివ్యాంగులను గుర్తించి వారికి ఉచితంగా ఉపకరణాలను అందజేయడానికి సిఫారసు చేస్తారన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలతో అర్హులైన దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు హాజరు కావాలని సూచించారు.
News August 17, 2025
ADB: రేపటి ప్రజావాణి రద్దు

ఈ నెల 18, 19 తేదీల్లో వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 18న సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.