News March 23, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌లో కారు ఖాళీ..!
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో BRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరు ‘కారు’ దిగుతుండటంతో ఆ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగేలా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు, ఆదిలాబాద్ జడ్పీ, డీసీసీబీ ఛైర్మన్‌లు ఇటీవల కారు దిగారు. ఇక నేడో రేపో మాజీ మంత్రి ఐకె రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరనున్నారు. దింతో ఉమ్మడి జిల్లాలో దాదాపు కారు ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తుంది.
Similar News
News January 6, 2025
కౌటాల: ప్రేమజంట పెళ్లి చేసిన పోలీసులు
ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కౌటాల మండలం గురుడుపేట్‌కు చెందిన నీకా సాయికుమార్(27), కన్నెపల్లికి చెందిన మానస(20) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసినట్లు కౌటాల SI మధుకర్ తెలిపారు. ఇందులో గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
News January 6, 2025
ASF: ఎమ్మెల్సీ కవిత పర్యటన జయప్రదానికి పిలుపు
బీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్, కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో కవిత పర్యటిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
News January 6, 2025
సారంగాపూర్: కత్తితో పొడిచారు.. అరెస్టయ్యారు
ఓ యువకుడిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్టయిన ఘటన సారంగాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. గ్రామీణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్ అదే గ్రామానికి చెందిన సాయికుమార్ డిసెంబర్ 31న గొడవపడ్డారు. ఇది మనసులో పెట్టుకున్న సాయికుమార్ ఓ మైనర్‌తో కలిసి ఈ నెల 4న కత్తితో అర్షద్‌ను పొడిచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అరెస్టు చేశారు.