News May 26, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చిరుజల్లులతో వాతావరణం చల్లబడగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా శనివారం నిర్మల్ జిల్లాలో 45.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.7, మంచిర్యాలలో 44.6, ఆసిఫాబాద్‌లో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News November 3, 2025

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ఎస్పీ

image

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సిబ్బందికి పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు.

News November 3, 2025

ADB: మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

image

ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజార్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరు దుకాణాల కేటాయింపులు ఈ కార్యక్రమంలో పూర్తయ్యాయి. ఎక్సైజ్ పాలసీ–2025–27 ప్రకారం షాపులకు టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. ప్రక్రియ మొత్తం ఫోటో, వీడియో రికార్డింగ్‌తో పూర్తి పారదర్శకంగా సాగింది.

News November 3, 2025

జూడో పోటీల్లో అదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ

image

హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఎస్జీఎఫ్ఐ జూడో పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 12 పతకాలతో మెరిశారు. బాలికల విభాగంలో నాగిని ప్రియ, సహస్ర, సింధు, అక్షిత, ప్రణీత, శృతిలు విజేతలుగా నిలవగా, బాలుర విభాగంలో మనోజ్, తరుణ్, హర్షవర్ధన్, లోకేష్, మధు, సంతోష్ అనే క్రీడాకారులు సత్తా చాటారనీ జూడో కోచ్ రాజు తెలిపారు.