News August 2, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News November 12, 2025
ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.
News November 12, 2025
ఉట్నూర్: తండ్రిని చంపిన కొడుకుకి 7ఏళ్ల జైలు శిక్ష

ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.
News November 12, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదని అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.


