News March 20, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT

Similar News

News January 1, 2025

MNCL: 3న ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ

image

SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ జనవరి 3న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News December 31, 2024

మంచిర్యాల: రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కేజీబీవీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కడెం మెయిన్ కెనాల్‌లో పడిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాల్ని పోలీసులకు చేరవేసినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 31, 2024

అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: నిర్మల్ SP

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున భైంసాలోని నాగదేవత ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించే క్రమంలో సమీపంలోని టైల్స్ పగిలిపోయాయన్నారు. ఇంతకుమించి ఆలయంలో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానిని నమ్మవద్దని SP విజ్ఞప్తి చేశారు.