News April 10, 2026

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు WARNING

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వేసవి తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాకు అలర్ట్‌ ప్రకటించింది. ఈ తేదీల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12-4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

Similar News

News April 13, 2026

ఇంట్లో ఏ రంగు శివలింగం ఉండాలి?

image

వేర్వేరు రంగుల శివలింగాలకు వేర్వేరు ప్రత్యేక శక్తులుంటాయని పండితులు చెబుతున్నారు. ‘నలుపు: రక్షణ, స్థిరత్వం, ధైర్యాన్ని, తెలుపు: శాంతి, ధ్యానానికి మద్దతు ఇస్తుంది. బంగారు/పసుపు: సంపద, వృత్తిలో పురోగతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ: కొత్త ప్రారంభాలకు సాయపడుతుంది. స్ఫటిక లింగం అతి శుభప్రదం. ఇది సామరస్యం, దైవిక రక్షణను ఆకర్షిస్తుంది. కోరికలకు తగిన లింగాన్ని ప్రతిష్ఠించాలి’ అని సూచిస్తున్నారు.

News April 13, 2026

122 బంతులు.. 0 వికెట్.. బుమ్రాకు ఏమైంది?

image

యార్కర్లు, స్లో బౌన్సర్లు, లో ఫుల్ టాస్‌లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బుమ్రాకు ఈ IPL కలిసి రావట్లేదు. గతేడాది MI ఆడిన చివరి మ్యాచ్, ఈ సీజన్‌ 4 మ్యాచుల్లో ఒక్క వికెట్టూ దక్కలేదు. 2025లో PBKSపై(0-40), 2026లో KKRపై(0-35), DCపై(0-21), RRపై(0-32), RCBపై(0-35) పేలవ గణాంకాలు నమోదు చేశారు. 122 బంతులు వేసినా వికెట్ రాలేదు. బుమ్రా IPL కెరీర్‌లో వికెట్ తీయకుండా ఇన్ని బాల్స్ వేయడం ఇదే తొలిసారి.

News April 13, 2026

మలయప్పస్వామి గురించి మీకు తెలుసా?

image

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్ప స్వామిని ఊరేగించారని వార్తల్లో వింటుంటాం. అయితే ఈయన కూడా శ్రీవారే. మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడిలోని మూలమూర్తి స్థిరంగా ఉండగా, భక్తులను కటాక్షించడానికి వారి వద్దకు కదులుతూ వచ్చే స్వామియే మలయప్పస్వామి. మలయప్పకోన అనే ప్రాంతంలో ఈ విగ్రహాలు లభించాయి.