News April 6, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు చల్లటి కబురు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
Similar News
News December 24, 2024
MNCL: నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన శ్రీయన్షి
బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయన్షి రన్నర్‌గా నిలిచినట్లు మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్ తో హోరాహోరీగా తలపడి రన్నర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీయన్షిని ఆయన అభినందించారు.
News December 24, 2024
ఆసిఫాబాద్: తల్లి లేక తల్లడిల్లుతున్న పసికూనలు
పాలు తాగి తల్లి ఒడిలో పడుకోవాల్సిన పిల్లల జీవితం అంధకారంగా మారింది. ASF జిల్లా పెంచికల్‌పేట్‌లో ఓ కుక్క 6 పిల్లలకు జన్మనిచ్చి 4 రోజుల క్రితం చనిపోయింది. దీంతో వాటికి పాలిచ్చేందుకు, చలికి తలదాచుకునేందుకు తల్లి ఒడి దూరమైంది. తల్లి చనిపోయిన విషయం తెలియక ఎముకలు కొరికే చలిలో నాలుగు రోజుల నుంచి ఓ ఆవు పక్కన తలదాచుకుంటున్నాయి. తల్లి కోసం పసిప్రాయాలు అల్లాడుతుంటే స్థానికులు చలించి పాలు అందించారు.
News December 24, 2024
కుబీర్: గొడ్డలితో దాడి.. రక్తపుమడుగులో యువకుడు
గొడ్డలితో ఓ వ్యక్తిపై దాడి జరిగిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. కుప్టి గ్రామానికి చెందిన విజయ్ ఆదివారం సాయంత్రం కస్రా గ్రామానికి మద్యం తాగడానికి వెళ్లాడు. నడుచుకుంటూ కుప్టి వెళ్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న యువకుడిని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.