News July 27, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్య వార్తలు

image

◾బోథ్: ఉదృతంగా ప్రవహిస్తున్న పొచ్చర జలపాతం◾ ఇంద్రవెల్లి: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య◾ ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుకు ప్రభుత్వం సహకరించాలి: పాయల్◾ఆదిలాబాద్: పాలిటెక్నిక్ లో చేరేందుకు మరొక అవకాశం◾ తలసరి ఆదాయంలో వెనుకబడిన ఆసిఫాబాద్◾ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలి: జాజుల◾ ADB వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ బదిలీలు◾ కడెం ప్రాజెక్ట్ ఒక గేట్ ఎత్తివేత

Similar News

News December 27, 2024

మంచిర్యాల: సిగ్నల్స్ రావాలంటే చెట్టెక్కాల్సిందే.!

image

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.

News December 27, 2024

సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’

image

అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.

News December 26, 2024

నిర్మల్ : ‘కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి’

image

కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్‌లు , టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.