News August 19, 2025
ఉమ్మడి కడప: నవోదయ ప్రవేశాల డేట్స్ పొడిగింపు

ఉమ్మడి కడప జిల్లాలో నవోదయ ప్రవేశానికి ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట మండలం నారంరాజుపల్లె జవహర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధరన్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అన్నమయ్య, కడప జిల్లాల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News August 19, 2025
రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది: KTR

TG: కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని BRS నేత KTR అన్నారు. ‘వారంలోనే HYDలో 2 షాకింగ్ క్రైమ్స్ జరిగాయి. పట్టపగలే ఓ జువెలరీ షాప్‌లో చోరీ, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక <<17444868>>హత్య<<>> ఘటనలు చోటుచేసుకున్నాయి. పబ్లిక్ సేఫ్టీ ప్రమాదంలో పడింది. ప్రజలకు రక్షణ కావాలి.. భయం కాదు. సమర్థులైన TG పోలీసులను లా & ఆర్డర్ కోసం కాకుండా రాజకీయ అవసరాలకు వాడుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని ఫైరయ్యారు.
News August 19, 2025
HYD- తిరుపతి విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్‌లొనే ఉన్నారు.
News August 19, 2025
ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో కడప జిల్లాకు మొదటి స్థానం

వెనుకబడిన కడప జిల్లాలను అభివృద్ధి చేయడం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఆస్పిరేషనల్ జిల్లాల్లోనే కడప జిల్లా 73.6 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా అధికారులతో ఆయన ఆస్పిరేషనల్ ప్రోగ్రాంపై సమీక్షించారు.