News July 30, 2024

ఉమ్మడి కరీంనగర్‌లో బదిలీలు

image

ఉమ్మడి KNR వ్యాప్తంగా దేవాదాయ శాఖలో బదిలీల ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని అర్చకులతో పాటు.. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు, పదోన్నతులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరికి పదవీ విరమణ వయసు దగ్గర పడటంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి KNR అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం బదిలీలకు శ్రీకారం చుట్టిందన్నారు.

Similar News

News November 27, 2024

రాజన్న స్వామివారి హుండీ ఆదాయం వివరాలు ఇవే

image

వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.

News November 27, 2024

ఎంఈవోలు రోజుకో పాఠశాల సందర్శించాలి: కలెక్టర్ పమేలా

image

తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.

News November 27, 2024

సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే 

image

పెద్దపల్లిలో డిసెంబర్ 4న సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను MLA విజయ రమణారావు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి బుధవారం పరిశీలించారు. రంగంపల్లి-పెద్దకల్వల శివారులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభ ఏర్పాట్లకు అనువుగా ఉంటుందని MLA తెలిపారు. సభా స్థలాన్ని శుభ్రం చేయాలని, గురువారం ఉదయం స్టేజ్ ఏర్పాటుకు HYD నుంచి ప్రత్యేక బృందం వస్తుందని చెప్పారు.