News March 27, 2025
ఉమ్మడి కరీంనగర్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

రాజన్న సిరిసిల్లలో జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన వివరాలను ఛైర్మన్ బక్కి వెంకటయ్య విడుదల చేశారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో దళితులపై చేసే దారుణాలు, భూ సమస్యలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు ఎలాంటి చట్టపరమైన సహాయం చేయనున్నట్లు తెలిపారు. సహాయనిధి, నిందితుల తీరుని ఎలా కట్టడి చేస్తున్నారు అనేదానిపైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
Similar News
News January 29, 2026
నాగర్ కర్నూల్ జిల్లాలో క్రమంగా తగ్గుతున్న చలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలితీవ్రత క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా వంకేశ్వర్, కొండారెడ్డిపల్లిలో 15.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పదర, అమ్రాబాద్ 15.1°C, ఐనోల్ 15.3°C, కొండనాగుల 15.4°C, బొల్లంపల్లి 15.5°C, తెలకపల్లి, వటవర్లపల్లి, తోటపల్లి లో 15.6°C, యంగంపల్లి, లింగాల 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 29, 2026
HYDలో ఎయిర్ క్వాలిటీ @236

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.
News January 29, 2026
ప.గో: బార్ లైసెన్సులకు నోటిఫికేషన్ విడుదల

పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 బార్‌లకు సంబంధించి జిల్లా అబ్కారీ శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సాపురం(1), తణుకు(3), తాడేపల్లిగూడెం(4) మున్సిపాలిటీల పరిధిలోని ఈ బార్‌లకు ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలని, ఆసక్తి ఉన్నవారు ఎన్ని అప్లికేషన్‌లు అయినా సమర్పించవచ్చని స్పష్టం చేశారు.


