News December 17, 2025

ఉమ్మడి కరీంనగర్‌లో 1,27,920 మంది ఓటర్లు

image

లోకల్ వార్ ఫైనల్‌కు చేరింది. నేటితో ఎన్నికల సంగ్రామం ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్‌లో 1,27,920మంది ఓటర్లు ఉండగా 388 GPలకు, 1580 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కరీంనగర్‌లో 80,190మంది మహిళలు, 84,853మంది పురుషులు, పెద్దపల్లిలో 73,669మంది మహిళలు, 70,892మంది పురుషులు, సిరిసిల్లలో 61,928మంది మహిళలు, 65,992మంది పురుషులు, జగిత్యాలలో 89,959మంది మహిళలు, 85,061మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News December 18, 2025

తూ.గో జిల్లాకు నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..!

image

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19వ తేదీన తూ.గో జిల్లాలో పర్యటించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 8.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని 5.45కి విజయవాడకు బయలుదేరుతారన్నారు. ఆయన పర్యటనకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

News December 18, 2025

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.

News December 18, 2025

అసభ్యంగా నివేద ఫొటోలు.. స్పందించిన హీరోయిన్

image

AI జనరేటెడ్ ఫొటోల <<18592227>>బెడద<<>> హీరోయిన్లను పట్టి పీడిస్తోంది. తాజాగా నివేదా థామస్ ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది తన గోప్యతపై దాడి అంటూ ట్వీట్ చేశారు. వీటిని పోస్ట్ చేసినవారు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఇటీవల పలువురు హీరోయిన్ల ఫొటోలూ ఇలాగే వైరల్ అయ్యాయి.