News September 25, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీ వర్ష సూచన
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు జగిత్యాల పరిశోధన స్థానం సహ పరిశోధన డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. 22-24 డిగ్రీల కనిష్ఠ, 33-34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ముఖ్యంగా రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దన్నారు.
Similar News
News November 24, 2024
జగిత్యాల: 120 మంది శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ ద్వారా కలుసుకున్న 120 మంది శ్రీనివాసులు స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో ASI రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 120 మంది శ్రీనివాసులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పరిచయ కార్యాచరణ నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2025లో మొదటివారం శ్రీనివాసులంతా కలిసి నిర్వహించే మహా సభను విజయవంతం చేయాలని కోరారు.
News November 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లా దీక్ష దివాస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే
ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్ష దివాస్ నిర్వహించనున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్ష దివాస్ నిర్వహణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. కరీంనగర్ జిల్లాకు MLC బండ ప్రకాశ్, సిరిసిల్ల జిల్లాకు మాజీ MP వినోద్ కుమార్, పెద్దపల్లి జిల్లాకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లాకు మాజీ MLC MD. సలీంను నియమించినట్లు ఆయన తెలిపారు.
News November 24, 2024
వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం భక్తులు ఉదయం నుంచే కోనేటిలో పుణ్యస్నానం ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.