News December 25, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికిస్తున్న చలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని (RG-III) ములకాలపల్లిలో 10.1℃, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.1℃ నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంలలో 10.8℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌లో 10.8℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 25, 2025
తిరుపతికి 32 రాష్ట్రాల ప్రతినిధుల రాక

తిరుపతిలో ఏడుకొండల చెంత 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ‘సమగ్ర వికాసానికి భారతీయ చింతన’ అనే భావనతో ఈ కార్యక్రమం 4రోజులు జరగనుంది. 32 రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు 288 నేరుగా, 620 పోస్టర్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. సదస్సులు, చర్చా గోష్టులు, చర్చలు, విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
News December 25, 2025
శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <
News December 25, 2025
తిరుమలలో RSS చీఫ్..

తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాలను RSS చీఫ్ మోహన్ భాగవత్ ఇవాళ సందర్శించారు. హిందూ సంప్రదాయంలో గోపూజకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేశారు. తిరుపతిలోని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు.


