News July 19, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటుకు మంత్రి పొన్నం హామీ.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.
@ ధర్మారం మండలంలో తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య.
@ కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ సహా ఆరుగురు కౌన్సిలర్లు.
@ రాయికల్ మండలంలో ఇద్దరు పేకాటరాయుళ్ల పట్టివేత.
Similar News
News August 18, 2025
కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-1 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ RK బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఆగస్టు 21న ఉ.6 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఆగష్టు 23న KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు 3,000/-, పిల్లలకు 2,250/- నిర్ణయించామన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.
News August 17, 2025
హుజురాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హుజురాబాద్ పట్టణంలోని కిందివాడకు చెందిన పోలీస్ హోంగార్డు బొడిగ తిరుపతి కుమారుడు బొడిగ సందీప్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తి గత అవసరాల నిమిత్తం పట్టణంలోని బతుకమ్మ సౌల్లల్లకు బైక్ పై వెళ్లిన సందీప్ అదుపుతప్పి కిందపడి ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఉదయమే తన స్నేహితులు, పరిచయస్తులను కలిసిన సందీప్ ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు స్నేహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
News August 16, 2025
రామకృష్ణ కాలనీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి కొడుతూ చిన్నారులు సంబరపడ్డారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ కృష్ణుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో యాద సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.