News September 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వడ్డేలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ సిరిసిల్ల జిల్లాలో వ్యక్తి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు.
@ జగిత్యాలలో పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన ఎస్పీ.
@ గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.
@ మెట్ పల్లిలో గంజాయి విక్రయించిన వ్యక్తి రిమాండ్.

Similar News

News August 31, 2025

కరీంనగర్‌లో SEPT 3న JOB MELA..!

image

నిరుద్యోగులకు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. SEPT 3న జిల్లా ఉపాధి కార్యలయంలో ఈ JOB MELA నిర్వహిస్తునట్లు చెప్పారు. 120పోస్టులు ఉన్నాయని.. ఫార్మాసిస్టు, సేల్స్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10TH నుంచి ఫార్మసీ చదివినవారు అర్హులని, వయసు 18-30ఏళ్లలోపు ఉండాలన్నారు. 9392310323, 9908230384 నంబర్లను సంప్రదించవచ్చు.

News August 31, 2025

KNR: వరద కాలువలో గల్లంతైన రహీం మృతదేహం లభ్యం

image

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.

News August 30, 2025

KNR: ‘వయోవృద్ధుల పోషణకు ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలి’

image

వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అనుసరించి ట్రిబ్యునల్ ఇస్తున్న ఉత్తర్వులను పాటిస్తున్నది లేనిది పర్యవేక్షించాలన్నారు. తద్వారా వృద్ధులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు