News April 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ భీమదేవరపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి. @ మెట్పల్లి మండలంలో 2 బైకులు ఢీకొని ఇద్దరి మృతి. @ రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండల వాసి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్. @ బిజెపికి ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నా మంత్రి పొన్నం ప్రభాకర్. @ కరీంనగర్ లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాలలో చాయ్ పే చర్చలో పాల్గొన్న ఎంపీ అరవింద్

Similar News

News January 5, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 2,70,067 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,30,094 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.69,300, అన్నదానం రూ.70,673 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 5, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రాయికల్ మండలంలో మనస్థాపo తో వ్యక్తి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయ ఈవో గా వేములవాడ ఆలయ ఈవో కు అదనపు బాధ్యతలు. @ జగిత్యాల లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. @ కోరుట్లలో మూడు షాపులలో చోరీ.

News January 4, 2025

పెద్దపల్లి: ఆస్పత్రిలో యువకుడి మృతి.. బంధువుల ఆందోళన

image

కమాన్‌పూర్ మండలం పేరపల్లికి చెందిన ఆకుల శ్రావణ్(26) గురువారం జ్వరంతో బాధపడుతూ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్ పరీక్షలు చేసి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ జాయిన్ చేసుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావణ్ మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులతో డాక్టర్ చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు.