News October 19, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీచ్ కానీ టార్గెట్..!

image

ఉమ్మడి KNR జిల్లాలో 2025-27కు గాను వైన్ షాప్ టెండర్ల ద్వారా రూ.380 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 287 వైన్ షాపులకు గాను 7188 దరఖాస్తుల ద్వారా రూ.215.64 కోట్ల ఆదాయం వచ్చింది. క్రితంసారి 10,734 దరఖాస్తులకు గాను 214.68 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి 3,546 దరఖాస్తులు తక్కువగా వచ్చినా రూ.కోటి 4 లక్షల ఆదాయం పెరిగింది. ఈనెల 23లోపు టార్గెట్ రీచ్ అవుతోందో, కాదో వేచి చూడాలి.

Similar News

News October 19, 2025

సూర్యాపేట: చెరువులో పడి యువకుడి మృతి

image

మోతె మండలం మామిళ్లగూడెంలో ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జూలకంటి సురేందర్ రెడ్డి (34) శనివారం రాత్రి చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయాడు. సురేందర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News October 19, 2025

ఆర్మీలో 90 ఆఫీసర్ ఉద్యోగాలు

image

ఇండియన్ ఆర్మీ జులై 2026లో ప్రారంభమయ్యే 55వ 10+2 TES కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్‌ (M.P.C)లో 60% మార్కులతో పాసై, JEE మెయిన్స్-2025 అర్హత సాధించినవారు NOV 13వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా 90మందిని ఎంపిక చేస్తారు. 4ఏళ్ల ట్రైనింగ్ తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగం లభిస్తుంది.

News October 19, 2025

మా సాయాన్ని మరిచారు: అఫ్గాన్‌పై షాహిద్ అఫ్రీది ఫైర్

image

అఫ్గాన్‌పై పాక్ Ex క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఫైరయ్యారు. తమ సాయాన్ని ఆ దేశం మరచిపోయినట్లుందని మండిపడ్డారు. ‘ఇలా జరుగుతుందని ఊహించలేదు. 50-60 ఏళ్లుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నేను 350 అఫ్గాన్ ఫ్యామిలీస్‌కు సాయం చేస్తున్నా’ అని అన్నారు. రెండూ ముస్లిం దేశాలు కాబట్టి సహకరించుకోవాలన్నారు. పాక్‌లో టెర్రరిజం సాగిస్తున్న వారితో అఫ్గాన్ చేతులు కలపడం విచారకరమని పరోక్షంగా భారత్‌పై అక్కసువెళ్లగక్కారు.