News May 15, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఓదెల మండలంలో ఈతకు వెళ్లి యువకుడి మృతి. @ కోరుట్ల మున్సిపల్ పరిధి ఎకిన్ పూర్ లో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కఠిన కారాగార శిక్ష. @ మేడిపల్లి మండలంలో హత్యకు పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన. @ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో కరీంనగర్ వాసి. @ వేములవాడలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
Similar News
News December 30, 2025
KNR: సన్న బోనస్ ఊసేది..? రైతు భరోసా ఎప్పుడు..?

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న సర్కారు హామీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది రైతుల ఖాతాల్లో నేటికీ నగదు జమకాలేదు. మరోవైపు ‘రైతు భరోసా’ ఊసే లేకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. అప్పులు తీరక, కొత్త సాగుకు సాయం అందక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
News December 29, 2025
కరీంగనర్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు.. వివరాలివే!

జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను అధికారులు విడుదల చేశారు. 2011 జనగణన ప్రకారం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో 66 వార్డులు, 328870 మంది జనాభా, ST-5999, SC-36902 మంది ఉన్నారు. కాగా, చొప్పదండిలో 14 వార్డులు, 16459 మంది జనాభా కాగా.. ST 205, ఎస్సీ 3062, హుజురాబాద్‌లో 30 వార్డులు, 34555 జనాభా, ST-309, SC-6326, జమ్మికుంటలో 30 వార్డులు, 39476 జనాభా ST 286, SC 7623గా ఉంది.
News December 29, 2025
KNR: కమిషనరేట్ విభాగాలను తనిఖీ చేసిన సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని పలు విభాగాలను సీపీ గౌస్ ఆలం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిన్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, ఆయుధశాల, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాల పని తీరును పరిశీలించారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన.. విధుల్లో అలసత్వం వహించవద్దని, క్రమశిక్షణతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను బాధ్యతాయుతంగా కాపాడాలని సూచించారు.


