News May 23, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ సైదాపూర్ మండలంలో 26 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మెట్పల్లి మండలంలో లారీ, కారు ఢీ.. కుమారుడి మృతి, తండ్రికి గాయాలు. @ ఓదెల మండలంలో చిరుత పులి సంచారం కలకలం. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య. @ కొడిమ్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. @ పెద్దపల్లి లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
Similar News
News September 13, 2025
KNR: సమగ్ర శిక్ష వ్యాయమ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్

సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వంగ ప్రకాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సొల్లు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా రజితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంగ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పారు.
News September 13, 2025
KNR: ప్రజాభవన్ ముట్టడిస్తాం: USFI

USFI నగర కమిటీ సమావేశం KNR సిటీలోని ఓ డిగ్రీ కళాశాలలో నగర అధ్యక్షుడు బుస మణితేజ అధ్యక్షతన సమావేశం జరిగింది. USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యారంగంపై సరైన సదస్సు పెట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
News September 13, 2025
KNR: ‘ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం విషయాలపై అవగాహన వస్తోంది’

రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన వస్తోందన్నారు. మహిళ తనతోపాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని సూచించారు.