News June 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్లపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
@ ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బైక్ ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు.
@ కోరుట్ల పట్టణంలో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ.
@ ఇబ్రహీంపట్నం మండలంలో దాడికి పాల్పడి చోరీ చేసిన ముగ్గురి అరెస్ట్.
@ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్.

Similar News

News February 19, 2026

KNR: మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

image

తెలంగాణ మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక డైరీ, వాల్ క్యాలెండర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, సెక్రటరీ రాజగోపాల్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, పిఓడిటి డా.ఉమాశ్రీ తదితులున్నారు.

News February 19, 2026

KNR: ‘రైతు రిజిస్ట్రేషన్ నూరు శాతం పూర్తి చేయాలి’

image

వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ రకాల కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ కార్యక్రమాల సద్వినియోగం కోసం ఉద్దేశించిన రైతు రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తిచేయాలని అన్నారు. వ్యవసాయ అధికారి వద్ద మాత్రమే కాకుండా మీ సేవా కేంద్రాల్లో కూడా 15 రూపాయల రుసుముతో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తవుతుందనే అవగాహన రైతులకు కల్పించాలని తెలిపారు.

News February 19, 2026

KNR: ‘పీఎం శ్రీ’ పెండింగ్ బిల్లులపై సమీక్ష

image

జిల్లాలో పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో వాననీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.