News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తప్పని నిరీక్షణ!

image

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

Similar News

News February 20, 2026

KNR: ‘మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావాలి’

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ స్కూల్ ఆవరణలోని జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం మ్యూజియం పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మ్యూజియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

News February 20, 2026

KNR: ‘పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవుల్లేవు’

image

వచ్చే నెల 14నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి,100% ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.