News December 14, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. రెండో విడతలో 394 గ్రామాలు

ఉమ్మడి KNR జిల్లాలో 2వ విడత GP ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 418 గ్రామ పంచాయతీలకు గానూ, 24 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 394 పంచాయతీలకు నేడు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని మండలాలు, పంచాయతీల వివరాలు ఇలా.. KNR – 5, 111, PDPL – 5, 70, JGTL – 7, 133, రాజన్న సిరిసిల్ల-3, 79. పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. జీపీ ఎన్నికల ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
Similar News
News December 15, 2025
డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం
News December 15, 2025
మెస్సీ.. ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదే!

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ గురించే ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. 3 రోజుల భారత పర్యటనలో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి ఓ కారణం ఉంది. ఆయన ఎడమ కాలుకు రూ.8వేల కోట్ల విలువ చేసే ఇన్సూరెన్స్ ఉంది. అయితే దేశం తరఫున, ఫ్రాంచైజీ లీగ్ మ్యాచుల్లో ఆడే సమయంలో కాలికి ఏమైనా జరిగితేనే ఇది వర్తిస్తుంది. ఎగ్జిబిషన్ మ్యాచులకు ఇది చెల్లుబాటు కాదు. దీంతో ఆయన మ్యాచుల్లో పూర్తి స్థాయిలో ఆడట్లేదని సమాచారం.
News December 15, 2025
ములుగు: నాడు దేశ రక్షకుడిగా.. నేడు గ్రామ పాలకుడిగా!

ములుగు మండలం బరిగేలానిపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధి వీరబోయిన రాజేందర్ 236 ఓట్లతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కాయిత కుమార స్వామిపై 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయిన రాజేందర్, అప్పుడు దేశ సేవలో ఇప్పుడు గ్రామ ప్రజల సేవకై సర్పంచ్‌గా గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


