News March 28, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు

image

ఏపీలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి నలుగురికి అవకాశం వరించింది. వారిలో నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అంగజాల గీత, పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నబి సాహెబ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కురువ మల్లయ్య ఉన్నారు.

Similar News

News March 31, 2025

NGKL: వివాహితపై అత్యాచారం.. ఆ వ్యక్తిదే కీలకపాత్ర!

image

ఊర్కొండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శనార్థం వచ్చిన<<15944914>> ఓ వివాహితపై జరిగిన అత్యాచార ఘటన<<>> సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి దేవాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 31, 2025

సంచలనం.. ‘మ్యాడ్ స్క్వేర్’ భారీ కలెక్షన్లు

image

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మ్యాడ్ గ్యాంగ్ చేసే కామెడీకి ప్రేక్షకుల గోలతో థియేటర్లు షేక్ అవుతున్నాయని పేర్కొంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు కీలక పాత్రలు పోషించారు.

News March 31, 2025

హెడ్‌కు స్టార్క్ దెబ్బ

image

SRH స్టార్ బ్యాటర్ హెడ్‌కు స్టార్క్ పీడకలలా మారారు. టాప్ లెవెల్ క్రికెట్లో స్టార్క్.. హెడ్‌ను 8 ఇన్నింగ్సుల్లో 6 సార్లు ఔట్ చేశారు. 34 బంతులు వేసి 18 రన్స్ మాత్రమే ఇచ్చారు. తన భయంతోనే హెడ్ ఫస్ట్ బాల్ స్ట్రైక్ తీసుకోలేదని నిన్న మ్యాచ్ అనంతరం స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా నిన్న SRHపై స్టార్క్ 5 వికెట్లు పడగొట్టి MOMగా నిలిచారు. గతేడాది క్వాలిఫైయర్-1, ఫైనల్లో స్టార్క్ SRHను దెబ్బకొట్టారు.

error: Content is protected !!