News April 10, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News February 14, 2026

పాలమూరు: జాతీయ చీఫ్ వచ్చినా.. ప్రభావం చూపని బీజేపీ!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. MBNRలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కిషన్ రెడ్డి కూడా ప్రచారం చేసినా బీజేపీ జెండా ఎగరలేదు. ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గంలో 37 వార్డుల్లో కేవలం 7 మాత్రమే గెలిచాయి. దీంతో కాషాయ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

News February 14, 2026

సంగారెడ్డి నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 4 సూపర్ లగ్జరీ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతిరోజూ ఉదయం 4:10, 5:50 గంటలకు, మధ్యాహ్నం 1:00, 2:00 గంటలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 14, 2026

మహాశివరాత్రి: తలకోన వద్ద విస్తృత ఏర్పాట్లు.!

image

తిరుపతి జిల్లా తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఏనుగులు, ఎలుగుబంట్ల సంచారం నేపథ్యంలో ఫిబ్రవరి 14–16 వరకు వాటర్ ఫాల్స్ వద్దకు ప్రవేశం నిషేధించారు. భక్తులకు రామ్–లక్ష్మణ్ బాతింగ్ ఘాట్ వరకు మాత్రమే అనుమతి ఉంది. సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, ఉచిత లడ్డూ, పార్కింగ్, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.