News April 16, 2025
ఉమ్మడి కృష్ణాలో SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలివే

త్వరలో విడుదల కానున్న DSC నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఉమ్మడి కృష్ణాలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో ప్రైమరీ లెవల్‌లో స్పెషల్ ఎడ్యుకేషన్(SGT) పోస్టులు 71 ఉండగా, సెకండరీ లెవల్‌లో 154 మంది స్కూల్ అసిస్టెంట్లు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో కావాల్సి ఉండగా..65 పోస్టులు ఇప్పటికే మంజూరు చేశామని, కొత్తగా 89 మంజూరయ్యాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News September 15, 2025
కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
News September 15, 2025
SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.
News September 15, 2025
పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.