News October 26, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్‌కు తగ్గతున్న ఆదరణ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యలో 20శాతం పైగా సీట్లు మిగిలిపోయాయి. ఎప్పుడు ఇంజినీరింగ్ సీట్లు దాదాపు 90 శాతంపైగా పూర్తి అయ్యేవి. నూతనంగా డీగ్రీలో కొన్ని కొత్త కోర్సులు రావడంతో ఇంజినీరింగ్‌లో వారు కోరుకున్న సీటు రాకపోవడంతో అటు వెళ్తున్నారని విద్య నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉద్యోగాలకు వెళ్లడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

Similar News

News February 1, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (PGRS) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.

News February 1, 2026

కంకిపాడుకి చెందిన సినీ నటుడు రఘునాథ్ రెడ్డి మృతి

image

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కంకిపాడుకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లో దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.

News February 1, 2026

అవనిగడ్డ అమ్మాయికి గ్రూప్–2లో ఉద్యోగం

image

అవనిగడ్డకు చెందిన సుధారాణి గ్రూప్–2 పరీక్షలో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తపాలా శాఖ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. స్థానిక పాఠశాలలో చదివిన సుధారాణి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించారు. 2016లో గ్రామీణ డాక్ సేవక్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టు ఉమెన్‌గా పనిచేశారు.