News February 26, 2026

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదుగురు డీఎస్పీల బదిలీ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు. బదిలీ అయిన వారిలో సౌత్ ఏసీపీ పవన్ కుమార్, ఎస్బీ ఏసీపీ భాను, అవనిగడ్డ డీఎస్పీ విద్య శ్రీ, మచిలీపట్నం డీఎస్పీ రాజా, గుడివాడ డీఎస్పీ వినీల్ ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

చిలుకూరు ఆలయానికి వన్నె తెచ్చింది ఆయనే!

image

చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ వన్నె తెచ్చారు. HYDకు కూతవేటు దూరంలో మొయినాబాద్ మం.చిలుకూరులో ఉన్న బాలాజీ గుడికి 2000 సంవత్సరం వరకు పెద్దగా ప్రాచుర్యంలేదు. సౌందరరాజన్ ఉద్యోగ విరమణ తర్వాత ఆలయానికి వచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. అప్పటి వరకు ఉత్సవాల సమయంలోనే భక్తులు వచ్చేవారు. స్వయం ప్రతిపత్తి దేవాలయంగా ప్రకటించి హుండీ, కానుకలు, టికెట్లు లేకుండా ఆలయాన్ని నడిపించారు.

News February 28, 2026

సిద్దిపేట: UDID మెడికల్ క్యాంపులు

image

సిద్దిపేట జిల్లాలోని దివ్యాంగుల కోసం మార్చి నెల UDID మెడికల్ క్యాంపుల షెడ్యూల్‌ను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. లోకోమోటర్, వినికిడి, దృష్టి లోపం, మానసిక వైకల్యం ఉన్న వారికి నిర్దిష్ట తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, సదరు ధృవపత్రాలతో క్యాంపునకు హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 28, 2026

మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు – నివారణ

image

బొగ్గు కుళ్లు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూతదశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతిని అనుసరించాలి.