News January 18, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతన డీఎస్పీలు వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా పలువురు డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ సౌత్ ఏసీపీగా దేవినేని పవన్ కుమార్, గుడివాడ డీఎస్పీగా ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీగా తాళ్లూరు విద్యశ్రీ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.

Similar News

News February 26, 2026

అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

image

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 25, 2026

వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.